- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dhanush: అదొక బ్లెస్సింగ్.. ‘రాయన్’ మూవీపై ధనుష్ కామెంట్స్
దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘రాయన్’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో రానుంది. ఇక ఇందులో ధనుష్‌తో పాటు హీరో సందీప్ కిషన్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటి వరకు ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ.. ‘డైరెక్షన్ అనేది చాలా భాద్యతతో కూడుకున్నది. నాకు నటనపైన ఎంత ఇష్టం ఉందో దర్శకత్వంపైనా అంతే ఇష్టముంది. నేను డైరెక్టర్ చేసిన ‘రాయన్’ 26న వస్తోంది. ఇదొక బ్లెసింగ్‌గా భావిస్తున్నాను. నిర్మాత కళానిధి మారన్, ఎఆర్ రెహ్మాన్, ప్రకాష్ రాజ్, ఎస్‌జే సూర్య, సందీప్, అపర్ణ, నా టెక్నికల్ టీం అందరికీ పేరుపేరునా థాంక్యూ. నన్ను ఎంతగానో అభిమానించే తెలుగు ఆడియన్స్‌కి ధన్యవాదాలు. నా నుంచి కోరుకునే మంచి డైలాగ్స్, యాక్షన్, సాంగ్స్ అన్ని ‘రాయన్’ లో ఉన్నాయి. రాయన్ నా యాభైవ సినిమా. తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాను. థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’ అంటూ చెప్పుకొచ్చాడు.
Read more...
Dhanush 'Rayan': సెన్సార్ పూర్తి చేసుకున్న ధనుష్ ‘రాయన్’.. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే?