మరోసారి డైరెక్టర్ గా ధనుష్

by Sridhar Babu |   ( Updated:2023-07-06 15:55:23.0  )
మరోసారి డైరెక్టర్ గా ధనుష్
X

దిశ, వెబ్​డెస్క్​ : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి డైరెక్టర్ అవతారమెత్తనున్నారు. ఈయన ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఈయన 50వ చిత్రంలో నటించనున్నాడు. దీనికి D50 అని ప్రస్తుతానికి పేరు పెట్టారు. ఈమేరకు స్వయంగా ఆయనే సోషల్​ మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈయన తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్​ భాషల్లో నటిస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవలే తెలుగులో సార్ మూవీతో మొదటిసారిగా స్ట్రెయిట్ ఫిల్మ్ చేశారు. అది చాలా పెద్ద హిట్​ అయిన విషయం తెలిసిందే. తన 50వ సినిమాను తానే స్వయంగా డైరెక్ట్ చేయనున్నాడు.

ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఇది ధనుష్‌కు దర్శకుడిగా రెండో సినిమా. ఈయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా ప పాండి. కాగా తన 50వ చిత్రం ముగ్గురు అన్నదమ్ముల జీవితాల చుట్టూ తిరుగుతుందని ధనుష్​ తెలిపాడు. ఆయనతో పాటు విష్ణు విశాల్, ఎస్‌జే సూర్య నటిస్తున్నారు. ఈ కథ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగనుంది. ఈయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా కమర్షియల్​గా హిట్​ కావడంతో రెండో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఈయన అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అలాగే తెలుగులో శేఖర్ కమ్ములతో ఒక సినిమాకు కమిట్ అయ్యాడని కూడా ప్రచారం అవుతుంది. త్వరలోనే ఈ సినిమా కూడా పట్టాలెక్కనున్నదని సమాచారం.

Read More: ఆ హౌలే గాళ్లందరిని మస్తు చితకొట్టాలనిపిస్తుంది: స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్

Advertisement

Next Story