- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరో సుమన్‌పై డీజీపీ కుట్ర.. సంచలన విషయాలు బయటపెట్టిన డైరెక్టర్
దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమయంలో సుమన్ నీలిచిత్రాల కేసులో 6 నెలలు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ నటుడికి ఎక్కువగా సినిమా అవకాశాలు దక్కడం లేదు. ఈ కేసులో కొందరు కావాలనే సుమన్‌ను ఇరికించారని నెట్టింట టాక్ వినిపించింది. అయితే ఈ కేసు అందరూ అనుకున్నట్టు నీలిచిత్రాల కేసు కాదట. ఈ విషయాన్ని దివంగత డైరెక్టర్ సాగర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘‘తమిళనాడు సీఎంగా ఎంజీఆర్ ఉన్న సమయంలో ఓ డీజీపీ ఉండేవాడట.
ఓ లిక్కర్ కాంట్రాక్టర్ ఎంజీఆర్‌కు చాలా దగ్గర మనిషి. అయితే డీజీపీ కుమార్తెకు సుమన్ అంటే చాలా ఇష్టం. సుమన్ ఎక్కడ మూవీస్ తీస్తే ఆ ప్లేస్‌కు వెళ్లేది. కానీ సుమన్ ఆమెను పట్టించుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ, తన కుమార్తెను సుమన్ ట్రాప్ చేశాడని తప్పుగా అర్థం చేసుకున్నాడు. అప్పట్లో సుమన్ స్నేహితుడికి క్యాసెట్ల షాప్ ఉండేది. అతను లిక్కర్ కాంట్రాక్టర్ కుమార్తెను ప్రేమించాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న డీజీపీ, లిక్కర్ కాంట్రాక్టర్‌తో సీఎం ఎంజీఆర్‌కు చెప్పాడు. ఎంజీఆర్ చెప్పినా నటుడు సుమన్ పట్టించుకోలేదు.
నా వైపు నుంచి ఏం తప్పు లేదు. కావాలంటే ఆ అమ్మాయికే చెప్పుకోండి అంటూ సుమన్ ఎదురు సమాధానం ఇచ్చాడు. దీంతో కోపగించుకున్న ఎంజీఆర్.. డీజీపీ, లిక్కర్ కాంట్రాక్టర్‌తో కలిసి బెయిల్ రాకుండా సుమన్‌ను ఆ కేసులో ఇరికించారు. ఇది నీలిచిత్రాల కేసు కాదు. ఇందులో ఏ హీరో ప్రమేయం లేదు’’ అంటూ దర్శకుడు సాగర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: పవన్ కల్యాణ్ టార్గెట్గా మంత్రి అంబటి కొత్త మూవీ.. టైటిల్ ఏంటో తెలుసా?