మీరు చూసింది కొంతే.. ఇంకా చాలా ఉన్నాయి.. ‘పుష్ప-2’పై దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-07-17 15:39:05.0  )
మీరు చూసింది కొంతే.. ఇంకా చాలా ఉన్నాయి.. ‘పుష్ప-2’పై  దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ఈ మూవీ 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్పకు సీక్వెల్‌గా రాబోతుంది. అయితే ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్, అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవి శ్రీ ప్రసాద్ వ్యవహరిస్తున్నాడు. అయితే పుష్ప-2 నుంచి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘సూసేకి అగ్గి రవ్వ మాదిరి సాంగ్’ అందరిలో భారీ అంచనాలను పెంచిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే పుష్ప-2 డిసెంబర్ 6న థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ క్రమంలో.. తాజాగా, దేవిశ్రీ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని భారీ అంచనాలను పెంచాడు. ‘‘ ఇటీవల నేను అస్సాంలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లాను. అక్కడ మొత్తం సూసేకి అగ్గి రవ్వ మాదిరి సాంగ్ వినిపించింది. అయితే అందులో మీరు చూసింది కొంతే. రిలీజ్ అయిన దాంట్లో ఎక్కువగా మేకింగ్ మాత్రమే చూపించారు. అసలైన డాన్స్ రివీల్ చేయలేదు. పిక్చరైజేషన్‌లో ది బెస్ట్ సాంగ్ అదే. పుష్ప-2 లో ఊహించనివి చాలా ఉన్నాయి. విజ్‌వల్ పరంగా సూసేకి పాట మరోస్థాయిలో ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమాలోంచి విడుదలైన రెండు పాటలకు వచ్చిన రెస్పాన్స్ దక్కించుకోవడం సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed