Dev Gill: పోలీసుల ధైర్యాన్ని, అంకిత భావాన్ని చూపించేదే ఈ సినిమా.. ‘అహో విక్రమార్క’ పై దేవ్‌గిల్

by sudharani |   ( Updated:2024-07-22 15:09:05.0  )
Dev Gill: పోలీసుల ధైర్యాన్ని, అంకిత భావాన్ని చూపించేదే ఈ సినిమా.. ‘అహో విక్రమార్క’ పై దేవ్‌గిల్
X

దిశ, సినిమా: పలు చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన దేవ్‌ కథానాయకుడిగా నటిస్తూ తన సొంత బ్యానర్‌లో నిర్మించిన చిత్రం 'అహో విక్రమార్క'. దీనికి పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్ట్‌ 30న మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కథానాయకుడు దేవ్‌ మాట్లాడుతూ 'అహో విక్రమార్క' చిత్రంలో పోలీసుల ధైర్యం, అంకిత భావాన్ని చూపిస్తున్నాం. నాలో విలనిజాన్ని చూసిన ప్రేక్షకులు ఈ చిత్రంలో కొత్త కోణాన్ని చూస్తారు. యూనివర్శల్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో నేను పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అన్నారు. దేవ్‌, సాయాజీ షిండే, ప్రవీణ్‌ తార్డే, తేజస్విని పండిట్‌, చిత్ర శుక్లా, ప్రభాకర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: పెన్మెత్స ప్రసాద్‌ వర్మ.


Read more...

‘కన్నప్ప’ నుంచి శరత్ కుమార్ లుక్ రిలీజ్.. నాతనందుడుగా ఆకట్టుకున్న నటుడు

Advertisement

Next Story