Devara: రికార్డు సృష్టించిన ‘దేవర’ రొమాంటిక్ సాంగ్!.. ఏకంగా

by Kavitha |
Devara: రికార్డు సృష్టించిన ‘దేవర’ రొమాంటిక్ సాంగ్!.. ఏకంగా
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘దేవర’. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు మేకర్స్. మొదటి భాగం దేవర పార్ట్ 1 నుంచి వచ్చిన మొదటి సింగిల్ ఫియర్ సాంగ్ అదిరిపోయింది. తాజాగా సోమవారం ఈ మూవీలోని రెండో పాటను విడుదల చేశారు. 'చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు.. అంటూ సాగింది ఈ పాట. కాగా సెకండ్ సింగిల్ పై మిశ్రమ స్పందన వస్తోంది. అయితే కొందరు సాంగ్ చాలా బాగుందని చాలా సంవత్సరాల తర్వాత తారక్‌ను రొమాంటిక్ లుక్‌లో చూసాం అని, జాన్వీ కపూర్ అదరగొట్టిందని, రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయని కామెంట్స్ చేయగా.. మరోవైపు సెకండ్ సింగిల్‌లోని మ్యూజిక్ బాగాలేదని, హాలీవుడ్ సాంగ్‌లోని మ్యూజిక్‌ను యధావిధిగా కాపీ చేసాడని అనిరుధ్ పై విమర్శలు చేస్తున్నారు నెటిజెన్స్.

అయితే వీటన్నిటిని దాటుకుంటూ దేవర దూసుకెళ్తున్నాడు. సాంగ్ రిలీజ్ చేసిన నాటి నుంచి నెం .1 స్థానంలో ట్రెండింగ్ అవుతూ 40 మిలియన్ల వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇందుకు సంబంధించి అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. త్వరలోనే ప్రమోషన్స్ స్పీడ్ పెంచే ఆలోచన చేస్తున్నారు నిర్మాతలు. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి 'ఫియర్ సాంగ్' విడుదలయ్యి మాస్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed