"దేవర" ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు... స్పందించిన ఎన్టీఆర్

by M.Rajitha |
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు... స్పందించిన ఎన్టీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), జాన్వి కపూర్(Janvi kapoor) హీరో హీరోయిన్లుగా కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం "దేవర(DEVARA)". నేడు జరగాల్సిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. హైదరాబాద్(Hyderabad) లోని నోవాటెల్(Novatel) హోటల్ నిర్వహించ తలపెట్టిన ఈ ఈవెంట్ కు అనుకున్నదానికంటే భారీగా అభిమానులు తరలి రావడంతో.. భద్రతా కారణాల రీత్యా ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్టీఆర్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎన్టీఆర్ అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పోటెత్తడంతో వారిని నిర్వహించడం కష్టంగా మారిందని తెలుస్తోంది. అకస్మాత్తుగా ఈవెంట్ రద్దు కాగా.. దూర ప్రాంతాల నుండి తమ అభిమాన నటున్ని చూడటానికి వచ్చిన ఫాన్స్ నిరాశతో వెనుదిరిగారు. కొంతమంది కోపంతో హోటల్ ను స్వల్పంగా ధ్వంసం చేయగా.. పోలీసులు వారందరికి సర్ది చెప్పి అక్కడి నుండి పంపించారు. ఇక మరోవైపు 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిన ఘటన మీద జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అంగరంగ వైభవంగా జరగాల్సిన ఈవెంట్ రద్దు కావడం బాధాకరంగా ఉందన్నారు. 'అవకాశం ఉన్నప్పుడల్లా ఫ్యాన్స్ తో ఉండాలని కోరుకున్నా, దేవర సినిమా ముచ్చట్లు పంచుకోవాలని ఆశపడ్డాను. భద్రతా కారణాల వల్ల ఈవెంట్ రద్దు కావడం మీకంటే నాకే ఎక్కువగా బాధగా ఉందన్నారు. ఇలా జరగడానికి దయచేసి ఎవరినీ నిందించకండి. ఎల్లప్పుడూ మీ ప్రేమకు ఋణపడి ఉంటాను' అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed