Reliance Jio: జియో సిమ్ యూజర్లకు గుడ్ న్యూస్.. కేవలం రూ.11కే 10జీబీ డేటా..!

by Maddikunta Saikiran |
Reliance Jio: జియో సిమ్ యూజర్లకు గుడ్ న్యూస్.. కేవలం రూ.11కే 10జీబీ డేటా..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతి పెద్ద ప్రైవేట్ టెలికాం నెట్ వర్క్, ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ జియో(Reliance Jio) వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే జియో తమ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరలో ఓ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌(Prepaid Recharge Plan)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా యూజర్ల కోసం దీన్ని ప్రవేశ పెట్టారు. ఈ రీఛార్జ్ ప్లాన్‌ కేవలం 11 రూపాయలకే లభిస్తోంది. యూజర్లు ఈ ప్లాన్ తో గంట పాటు 10 GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. 10 GB డేటా అయిపోయిన తర్వాత డేటా స్పీడ్ తగ్గుతుంది. ఈ ప్లాన్ ముఖ్యంగా సినిమాలు(Movies) లేదా పెద్ద సైజు లో ఉన్న ఫైల్స్(Files) డౌన్ లోడ్ చేసుకోవడానికి, గేమ్‌లను ఇన్‌స్టాల్(Games Install)చేయడానికి ఉపయోగపడనుంది. అయితే ఈ ప్లాన్ పొందాలంటే జియో కస్టమర్లు బేస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకొని ఉండాలి. ఇదేగాక జియోలో ఇంకా చాలా రకాలైన డేటా ప్లాన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

Next Story

Most Viewed