- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YSRCP: చంద్రబాబు నువ్వు చీటర్ వి కాదా..? మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు(CM Chandrababu) నువ్వు చీటర్(Cheater) వి కాదా? నీపై 420 కేసులు ఎందుకు పెట్టకూడదు అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YCP leader YS Jagan Mohan Reddy) అన్నారు. కూటమి ప్రభుత్వం(NDA Government) ఇచ్చిన హామీలను(Promises) ప్రస్తావిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. చంద్రబాబు.. ప్రజలకు సూపర్‌సిక్స్(Super Six) పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో(AP Budget) ఎగ్గొట్టిన నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా? అని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 లు ఇవ్వాల్సి ఉందని, 2.07 కోట్ల మంది మహిళలకు ఎంత ఇచ్చారని, దీపం కింద 3 గ్యాస్ సిలిండర్లకు ఎన్ని కోట్లు కేటాయించారని ప్రశ్నించారు.
అలాగే తల్లికి వందనం పథకం కింద పిల్లలకు రూ.15,000లు ఇస్తా అన్నారు.. ఎంత మందికి ఇచ్చారని, అన్నదాత పథకం కింద రైతుకు రూ.20వేల చొప్పున 53.52 లక్షల మంది రైతులకు ఎంత ఇచ్చారని నిలదీశారు. అంతేగాక ఉచిత బస్సు ప్రయాణానికి ఇప్పటి వరకు అతీగతీలేదని, యువగళం కింద నిరుద్యోగులకు రూ.3వేలు ఇస్తా అన్నారు. ఎప్పుడు ఇస్తారని విమర్శలు చేశారు. 50 ఏళ్లు పైబడిన వారికి రూ.4వేలు పింఛన్ అన్నారని, రాష్ట్రంలో ఉన్న 17 లక్షల మందికి ఎంత ఇచ్చారని అంటూ.. నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రశ్నిస్తే కేసులు(File Cases) పెడతానంటున్నావని, అరెస్టులు(arrests) చేస్తానంటున్నావని, నాతో సహా మా పార్టీ నాయకులు(Party Leaders), కార్యకర్తలు(Activists), సోషల్‌మీడియా యాక్టివిస్టులు(Social Media Activists) నిన్ను నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారని జగన్ స్పష్టం చేశారు.