ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య

by Shiva |   ( Updated:2024-11-13 17:00:11.0  )
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఇంటర్ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య అన్నారు. మూడేండ్లుగా పరీక్షల ఫలితాల్లో రిపీడెట్‌గా వస్తున్న తప్పుల డేటాను ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఇంటర్ బోర్డు సెక్రెటరీగా, ఇంటర్మీడియేట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఉద్యోగులు అంతా క్రమశిక్షణతో ఉండాలని, సమయపాలన పాటించాలని సూచించారు.

సెక్షన్లలో పనులను పెండింగ్‌లో పెట్టొద్దని, ఏ రోజు పని ఆ రోజే చేయాలని ఆదేశించారు. ఫిజికల్ ఫైల్స్ పంపొద్దని.. ఏమైనా ఈ-ఆఫీస్ ద్వారానే కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యను పలు సంఘాల నేతలు కలిసి అభినందనలు తెలియజేశారు. ఆయనను కలిసిన వారిలో మధుసూదన్ రెడ్డి, తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మైలారం జంగయ్య, ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణేశ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed