- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Patnam Narender Reddy: జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి లేఖ.. రిమాండ్ రిపోర్టుపై సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: లగచర్ల (Lagacharla)లో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో అరెస్టైన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే 14 రోజుల రిమాండ్‌లో భాగంగా ఆయన చర్లపల్లి జైలు (Charlapally)లో ఉన్నారు. ఈ మేరకు నరేందర్ రెడ్డిని 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ.. పోలీసులు వికారాబాద్ కోర్టు (Vikarabad Court)లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy)) ఓ లేఖను విడుదల చేశారు. అందులో పోలీసులు విడుదల చేసిన రిమాండ్ రిపోర్టు (Remand Report)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు తన పేరుతో అబద్ధపు కన్ఫెషన్ రిపోర్టు (Confession Report) ఇచ్చారని ఆరోపించారు. తాను చెప్పినట్లుగా కేటీఆర్ (KTR) పేరు ప్రస్తావించడాన్ని ఆయన తప్పుబట్టారు. కేటీఆర్ (KTR) గురించి, కేసు గురించి తాను ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. అసలు రిమాండ్ రిపోర్టులో ఏముందో కూడా తనకు తెలియదని నరేందర్ రెడ్డి అన్నారు.
బెయిల్ కోసం పిటిషన్ దాఖలు
కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) బెయిల్ (Bail) కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన వికారాబాద్ జిల్లా కోర్టు (Vikarabad District Court)ను ఆశ్రయించారు. అయితే, పిటిషన్‌పై మెజిస్ట్రేట్ సోమవారం విచారించనున్నారు. కలెక్టర్ (Collector) సహా అధికారులపై దాడి చేసిన కేసులో పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి (Patnam Naredner Reddy)ని బుధవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను ప్రస్తుతం చర్లపల్లి జైలు (Charlapally Jail)లో ఉన్నారు.