జిమ్ ట్రైనర్‌ దారుణ హత్య.. డంబెల్‌తో బాది మరీ!

by Aamani |   ( Updated:2025-04-08 07:23:39.0  )
జిమ్ ట్రైనర్‌ దారుణ హత్య..  డంబెల్‌తో బాది మరీ!
X

దిశ, మేడిపల్లి: జిమ్ ట్రైనర్ పై డంబెల్ తో దాడి చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం బోడుప్పల్ ఇంద్రనగర్ కాలనీలో కి చెందిన ఎర్పుల సాయి కిరణ్ తన తమ్ముడు అయినా ఎర్పుల సాయి కిషోర్ (34) జిమ్ ట్రైనర్ ను జిమ్ లో తన స్నేహితుడు చంటి డంబెల్ తో తన తమ్ముణ్ణి తలపై బలంగా కొట్టాడు. తలపై బలమైన గాయాలు అవ్వగా అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్ లో తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం కిషోర్ మృతి చెందాడు. అన్న ఎర్పుల సాయి కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాని సీఐ గోవింద రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed