- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mock Assembly : మాక్ అసెంబ్లీకి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్ : బాలల దినోత్సవం(Children's Day) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. ఎన్సీఈఆర్టీ(NCERT)లో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ(Students Mock Assembly) కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. విద్యార్థుల మాక్ అసెంబ్లీని వీక్షించి, వారిని అభినందించారు. విద్యార్థులు చాలా చక్కగా, హుందాగా.. ప్రభుత్వ, ప్రతిపక్షపాత్రలు పోషించారని ప్రశంసించారు. శాసన సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు... ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలన్నారు . విపక్షాలు ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం వారి బాధ్యత అని..లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపొజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయని తెలిపారు. సభను సమర్ధవంతంగా నడిపే బాధ్యత స్పీకర్ పై ఉంటుందని, విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలి.. కానీ దురదృష్టవశాత్తు ఈరోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చేస్తున్నారని పేర్కొన్నారు.
దేశంలో ప్రతి పేదవాడు చదువుకునేందుకు విద్యా విప్లవాన్ని తెచ్చింది జవహర్ లాల్ నెహ్రూ(JavaherLal Nehru) అని గుర్తు చేశారు. నెహ్రూ స్పూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాహక్కు చట్టం తెచ్చిందని అన్నారు. రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) వల్లే 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు వచ్చిందన్న సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీకి పోటీ చేసే వయసును 25 నుంచి 21 ఏళ్ళకు తగ్గిస్తే.. రాజకీయాల్లోకి యువత వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో యువతరం ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
- Tags
- CM Revanth Reddy