'దేశం కోసం భ‌గ‌త్ సింగ్‌' ఆడియో ఆవిష్కర‌ణ‌!

by Hajipasha |   ( Updated:2023-01-25 13:09:53.0  )
దేశం కోసం భ‌గ‌త్ సింగ్‌ ఆడియో ఆవిష్కర‌ణ‌!
X

దిశ, సినిమా: రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'దేశం కోసం భ‌గ‌త్ సింగ్‌'. నాగ‌ల‌క్ష్మి ప్రొడ‌క్షన్స్ అధినేత రవీంద్ర గోపాలతో కలిసి నిర్మించిన ర‌వీంద్ర జి ద‌ర్శక‌త్వం వ‌హించిన మూవీ ఆడియో ఆవిష్కరణ ఫిలిం చాంబ‌ర్‌లో ఘనంగా జరిగింది. అతిథులుగా పాల్గొన్న ప‌రుచూరి గోపాల‌కృష్ణ, దామోద‌ర్ ప్రసాద్, ప్రస‌న్న కుమార్, మోహ‌న్ వ‌డ్లప‌ట్ల, బాబ్జీ, ప్రమోద్ శ‌ర్మ, బ‌ల్లెపల్లి మోహ‌న్‌, ఘంటాడి కృష్ణ, ర‌వీంద్ర గోపాల మాట్లాడుతూ.. 'దేశం కోసం రవీంద్ర గోపాల్ 14 పాత్రల్లో నటించిన సినిమా ఇది. స్వాతంత్ర్య స‌మ‌ర యోధుల గొప్పత‌నాన్ని ప్రపంచానికి తెల‌పాల‌న్న త‌పన‌ను అభినందిస్తున్నాం. పాట‌లన్నీ అద్భుతంగా ఉన్నాయి. ప్రమోద్ కుమార్‌ సంగీతం సమకూర్చిన ప్రతీ గీతంలో దేశ‌భ‌క్తి ఉట్టిప‌డుతోంది. ఈ మూవీ ఘనవిజ‌యం సాధించి మ‌రెన్నో మంచి చిత్రాలు చేసే ప్రోత్సాహాన్ని క‌ల్పించాల‌ని కోరుకుంటున్నాం. క‌మ‌ర్షియ‌ల్ కాలంలో క్లాసిక్ సినిమా చేసిన ర‌వీంద్ర గోపాల్‌ని అభినందిస్తున్నాం' అన్నారు.

ఇవి కూడా చదవండి : 'Hara Hara Veeramallu' టీజర్ అప్‌డేట్..??

Advertisement

Next Story