నాకు ఆ అలవాటే లేదు.. ‘Jawan’ Remuneration ఇష్యూపై స్పందించిన Deepika Padukune

by sudharani |   ( Updated:2023-09-15 16:22:10.0  )
నాకు ఆ అలవాటే లేదు.. ‘Jawan’ Remuneration ఇష్యూపై స్పందించిన Deepika Padukune
X

దిశ, సినిమా : ‘జవాన్’ మూవీలో స్పెషల్ రోల్ పోషించేందుకు భారీగా వసూల్ చేసిందనే వార్తలపై దీపికా పదుకొణె స్పందించింది. షారుఖ్ హీరోగా అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొడుతోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ పత్రికతో మాట్లాడిన దీపిక.. మూవీ ఘన విజయాన్ని ఉద్ధేశిస్తూ ఇండస్ట్రీలో తాము ఇద్దరం అదృష్టవంతులమని చెప్పింది. ‘మా మధ్య ఎంతో నమ్మకం, గౌరవం ఉంది. మేము ఒకరికొకరం లక్కీ చార్మ్. నిజం చెప్పాలంటే అదృష్టం కంటే ఎక్కువ. అందుకే కెరీస్ సక్సెస్‌గా దూసుకుపోతుంది’ అంటూ మురిసిపోయింది. అలాగే పారితోషికం గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ గణాంకాలకు ఆకర్షితురాలని కాలేదు. ఇలాంటి మంచి సినిమాలు మళ్లీ మళ్లీ రావాలన్నదే నా ఆకాంక్ష. ‘జవాన్’మాత్రమే కాదు ఏ సినిమాకు అతిథి పాత్రకు డబ్బులు తీసుకోలేదు. ఎవరి దగ్గరా రూపాయి కూడా వసూల్ చేయలేదు. షారుఖ్ సినిమాల్లో గెస్ట్ రోల్ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా’ అంటూ క్లారిటీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి : బాత్ టవల్ చుట్టుకుని శోభిత హాట్ షో.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న పిక్స్

Advertisement

Next Story