- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Deepika Padukone: నెట్టింట వైరలవుతోన్న దీపికా పదుకొణె సీమంతం ఫోటోలు..?
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె అండ్ రణవీర్ సింగ్ 2019 లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం వీరు ఎలాంటి పిల్లల ప్లాన్ చేయకుండా కెరీర్ పై దృష్టి పెట్టారు. అలాగే దీపికాకు వివాహనంతరం వరుస ఆఫర్లు రావడంతో పిల్లల గురించి ఆలోచించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏడు నెలల గర్భవతి. మరో రెండు నెలల్లో ఓ పాప లేదా బాబుకు జన్మనివ్వబోతుంది. ఇప్పటికే జ్యోతిష్య పండితులు ఈ హీరోయిన్‌కు బాబు పుడతారని చెప్పిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రెగ్రెన్సీతోనే దీపికా ఇటీవల చరిత్రలో నిలిచిపోయేలా వివాహం చేసుకున్న ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి హాజరైంది. తళతళ మెరిసే డ్రెస్ ధరించి.. పెళ్లి వేడుకలో ఈ భామ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఇకపోతే దీపికా పదుకొణె గర్భవతి కాబట్టి కుటుంబ సభ్యులు తనకు సీమంతం చేసినట్లు సోషల్ మీడియాలో పలు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ దుస్తుల్లో దీపికా సంప్రదాయ దుస్తుల్లో జడలో మల్లెపూలు పెట్టుకుని, పొట్ట పట్టుకుని కనిపిస్తుంది. ఈ పిక్స్ నెట్టింట స్ప్రెడ్ అవ్వడంతో ఫొటోలు వీక్షించిన జనాలు నిజమైనవేనా? లేక నకిలీవా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక దీపికా పదుకొణె జవాన్, పఠాన్, ఫైటర్..రీసెంట్ గా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం కల్కి వంటి పెద్ద పెద్ద మూవీల్లో నటించి.. ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఈ బ్యూటీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇప్పటివరకు వరుస చిత్రాలతో మెరిసిన ఈ బాలీవుడ్ బ్యూటీ బిడ్డ పుట్టాక సినిమాల్లో నటిస్తుందా? లేదా?అని అభిమానులు సందేహిస్తున్నారు.