ఆ అనుభవమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది: Deepika Padukone

by sudharani |   ( Updated:2022-10-01 11:59:30.0  )
ఆ అనుభవమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది: Deepika Padukone
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి దీపికా పదుకొణె మరోసారి తాను డిప్రెషన్‏తో పోరాడిన రోజులను గుర్తుచేసుకుంది. రీసెంట్ ఇంటర్య్వూలో మాట్లాడుతూ మనసుకు, శరీరానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానన్న నటి.. ఆ తర్వాతే ఇతర విషయాల గురించి ఆలోచిస్తానని చెప్పింది. ఇక గతంలో తీవ్ర మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది నిజమేనని, ఆ సమయంలో తన తల్లి అండగా నిలిచిందని తెలిపింది.

'మానసిక వ్యాధితో బాధపడిన అనుభవమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. అందుకే అన్నింటికంటే మనసుకు, శరీరానికి ప్రాధాన్యత ఇస్తా. ఎవరైనా సరే ఉన్నత స్థాయిలో ఉండానికి ముందు ఇలాంటి సంఘటలను ఎదుర్కోవాల్సిందేనేమో. ఈ అనుభవాలు జీవితంలో ఎన్నో ఒడిదొడులకును ఎదుర్కోవడానికి సహాయపడుతాయి. అవే నన్ను విజయవంతమైన నటిగా ప్రపంచానికి పరిచయం చేశాయి' అని వివరిచింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహం కలిసి నటిస్తోన్న యాక్షన్ డ్రామా 'పఠాన్'తోపాటు ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే', హృతిక్ రోషన్, అనిల్ కపూర్ కాంబోలో రాబోతున్న 'ఫైటర్' సినిమాలోనూ నటిస్తోంది.

ఇవి కూడా చదవండి : ఆ ఉత్సాహం రావట్లే.. చరణ్‌తో సినిమాపై చిరు సంచలన కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed