Nassar : నటుడు నాజర్ ఇంట్లో తీవ్ర విషాదం..

by sudharani |   ( Updated:2023-10-10 11:57:37.0  )
Nassar : నటుడు నాజర్ ఇంట్లో తీవ్ర విషాదం..
X

దిశ, వెబ్‌డెస్క్: విలక్షణ నటుడు నాజర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి మాబూబ్ బాషా (95) మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నాజర్ కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి మరణంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకోగా.. పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story