సి-సెక్షన్ డెలివరీ.. బాధలోనూ ఆనందాన్ని వెతుక్కున్నా: డెబినా

by Hajipasha |   ( Updated:2022-12-01 15:17:43.0  )
సి-సెక్షన్ డెలివరీ.. బాధలోనూ ఆనందాన్ని వెతుక్కున్నా: డెబినా
X

దిశ, సినిమా: టెలివిజన్ యాక్ట్రెస్ డెబినా బోనర్జీ సి-సెక్షన్ డెలివరీ అనుభవాలను పంచుకుంది. డెబినా-గుర్మీత్ చౌదరి దంపతులు ఈ మధ్యే సెకండ్ బేబీని స్వాగతించగా.. నవ జాత శిశువుకు సంబంధించిన ప్రతి విషయాన్ని నెట్టింట పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే పాలిచ్చే తల్లుల ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాలని ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ కోరగా.. సి-సెక్షన్ డెలివరీ నుంచి కోలుకుంటూనే చనుబాలివ్వడం కష్టతరమైన పని అయినప్పటికీ మాతృత్వపు ఆనందం పొందుతారని చెప్పింది.

అయితే సిజేరియన్ కారణంగా చాలామంది భయాందోళనకు గురవుతారన్న ఆమె.. 'ఆందోళన చెందాల్సిన పనిలేదు. వైద్య సదుపాయాలు చాలా అభివృద్ధి చెందాయి. మరుసటి రోజు నుంచి మీరు మెరుగ్గా ఉంటారు. ఒత్తిడి అనేది పాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి స్ట్రెస్ లేకుండా ఉండాలని చెప్పారు' అని పేర్కొంది. చివరగా తన కూతురు నిద్రిస్తున్న సమయాన్ని వివరిస్తూ 'నా లిటిల్ బేబీ పగటిపూట ప్రశాంతంగా నిద్రిస్తుంది. రాత్రి మెలకువగా ఉంటుంది' అంటూ ఫన్నీగా ముగించింది.

READ MORE

పుట్టుకతోనే నా గుండెకు రంధ్రం ఉంది: నీతి టేలర్

Advertisement

Next Story