- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిస్ యూనివర్స్‌తో డేటింగ్.. ప్రియురాలితో పెళ్లి.. సంచలనం సృష్టిస్తోన్న వార్త
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సినీ పరిశ్రలో ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవడం.. అనంతరం మనస్పర్థాల కారణంగా విడిపోవడం కామన్ అయిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. రీసెంట్‌గా టాలీవుడ్‌లో ఇప్పటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో కుటుంబ సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ రోజు హైదరాబాదులో అంగరంగ వైభవంగా రిసెప్షన్ చేసుకోబోతున్నారు.
మరో హీరోయిన్ అమలాపాల్ కూడా ఇవాళ గ్రాండ్‌గా ప్రియుడితో వివాహ జరుపుకున్నారు. ఇక వచ్చే ఏడాది జనవరిలో అమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన ప్రియుడు నుపుర్ శిఖరేను పెళ్లి చేసుకోబోతున్నారు. అలాగే మరో బాలీవుడ్ జంట సైతం పెళ్లి పీటలెక్కెందుకు సిద్ధపడుతోన్నట్లు సమాచారం.
వారెవరో కాదు.. బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా తన ప్రియురాలు.. మణిపూర్‌కు చెందిన లిన్ మోడల్‌గా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న నటి లిన్ లైస్రామ్‌ను ఈ నెల (నవంబరు) లోనే వివాహం చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే రణదీప్, లిన్ పెళ్లికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారట. వీరి పెళ్లి ముంబైలో జరగనున్నట్లు టాక్. కాగా ఈ కపుల్ వివాహానంతరం వీరి రిలేషన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.
అయితే, రణ్‌దీప్ గతంలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో రిలేషన్‌లో ఉన్నారని అప్పట్లో వార్తలు వినిపించాయి. గతంలో రణదీప్ ఓ ఇంటర్వ్యూకు హాజరై.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘‘మేం విడిపోయి మంచి నిర్ణయం తీసుకున్నామని అన్నారు.’’ కాగా 2004లో సుస్మితాసేన్‌తో డేటింగ్‌లో ఉన్న రణ్‌దీప్ 2006లో విడిపోయారంటూ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతోంది.