Ranbir Kapoor : ‘యానిమల్’ సినిమా టీజర్‌కు డేట్ ఫిక్స్..అధికారిక ప్రకటన విడుదల

by Hamsa |   ( Updated:2023-09-18 09:04:49.0  )
Ranbir Kapoor : ‘యానిమల్’ సినిమా టీజర్‌కు డేట్ ఫిక్స్..అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ సందీప్ వంగ ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో తెరకెక్కించి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ అనే చిత్రంతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న రిలీజ్ చేయనున్నారు.

తాజాగా, ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ‘యానిమల్’ చిత్రం టీజర్ సెప్టెంబర్ 28న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో రణబీర్ అభిమానులు ఈ టీజర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story