‘దసరా’ ట్విట్టర్ రివ్వూ.. సినిమా ఎలా ఉందంటే..?

by sudharani |   ( Updated:2023-03-30 12:21:00.0  )
‘దసరా’ ట్విట్టర్ రివ్వూ.. సినిమా ఎలా ఉందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘దసరా’. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో నాని మాస్ లుక్‌లో అలరించాడు. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన షోలు భారతదేశంలో మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అయితే యూఎస్‌లో మూవీ ప్రీమియర్లు ఇప్పటికే పడిపోయాయి. దీనికి సంబంధించి ట్విట్టర్ రివ్వూ ఎలా ఉందంటే..

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేజీయఫ్‌ను దాటే రేంజ్‌లో ‘దసరా’ ఉందని.. శ్రీకాంత్ దర్శకత్వానికి 100 మార్క్స్ అంటూ తెలుపుతున్నారు. అంతే కాకుండా ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్‌కు ఆడియన్స్ మెస్మరైజ్ కావడం పక్కా అంటూ ట్విట్టర్‌లో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శ్రీరామనవమి సందర్భంగా వచ్చిన ‘దసరా’ మంచి హిట్ టాక్‌ను అందుకుంది.

Advertisement

Next Story