- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రముఖ యాంకర్ పేరిట మోసం.. సైబర్ నేరగాళ్ల చేతిలో యువకుడికి టోపీ.. ఏంతంటే..?
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన భాష, యాసతో వార్తలు చెప్పి ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకుంది. ఇక తన కొచ్చిన ఫేమ్‌తో టెలివిజన్ షోలలో మెరిసిపోవడమే కాకుండా.. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి మరింత అభిమానులకు దగ్గరయ్యింది. ఈ క్రమంలోనే సొంతంగా యూట్యూబ్ ఛానల్ సైతం రన్ చేస్తుంది శివజ్యోతి. సోషల్ మీడియదలో ఎక్కువ యాక్టీవ్‌గా ఉండే శివజ్యోతి పేరును అడ్డం పెట్టుకుని ఓ అభిమానిని మోసం చేసి డబ్బులు గుంజారు సైబర్ నేరగాళ్లు. వివరాల్లోకి వెళితే..
హుస్సేన్ అనే యువకుడు సోషల్ మీడియాలో శివజ్యోతిని ఫాలో చేస్తూ ఉంటాడు. నిత్యం ఆమె వీడియోలు చూస్తున్న అతడికి ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారా రివార్డ్స్ పాయింట్స్ వచ్చాయని టెలిగ్రామ్ ద్వారా లింక్ వచ్చింది. అయితే నిత్యం శివజ్యోతి వీడియోలు చూడటంతో నిజంగానే రివార్డ్స్ వచ్చాయి అనుకుని ఆ లింక్ ఓపెన్ చేశాడు. అయితే ఆ రివార్డ్స్ రావాలంటే మొదట రూ.1000 పంపాలని వచ్చింది. దాంతో వెంటనే ఆ యువకుడు డబ్బులు పంపాడు. తర్వాత రెండు, మూడు సార్లు అదే విధంగా మెసేజ్‌లు రావడంతో అప్పటికీ అది మోసం గ్రహించక పోవడంతో రూ. 10 వేల వరకు పంపించాడు.
అనంతరం రివార్ట్స్ గురించి అడిగేసరికి అటువైపు నుంచి రిప్లై రాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. దీంతో హుస్సేన్ పూర్తి వివరాలతో పాటు తన ముబైల్ నెంబర్‌ను యాంకర్ శివజ్యోతికి పంపించాడు. ఇక ఈ మోసంపై స్పందించింది శివజ్యోతి.. హుస్సేన్ పంపిన మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. అభిమానులు ఇలాంటి వాటిని నమ్మకండి, నాకు అసలు టెలిగ్రామ్ ఖాతానే లేదు అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల పేరిట సైబర్ నేరగాళ్లు చేసే మోసాలు ఎక్కువ అవుతున్నాయి.