- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శిశువులు ఎంత బాధలో ఉన్నాయో చెప్పేస్తున్న మొసలి.. ఆశ్చర్యంగా తల్లి కంటే గొప్పగా అర్థం చేసుకుంటుంది..
దిశ, ఫీచర్స్: అవకాశం వస్తే మనుషులను మట్టుబెట్టేందుకు ప్రయత్నించే మొసళ్లు.. శిశువుల ఏడుపును మాత్రం తల్లి కంటే ఎక్కువగా అర్థం చేసుకుంటున్నాయని తెలిపింది తాజా అధ్యయనం. దు:ఖంలోని ఫ్రీక్వెన్సీలో మార్పులపై ఆధారపడి రియాక్ట్ అవుతున్నాయని ఫ్రాన్స్‌లోని లియోన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందుకోసం 12 మంది మానవులు (హోమో సేపియన్స్), ఐరోపా జంతు ప్రదర్శనశాలల్లో ఆరు క్యాప్టివ్ బోనోబోలు (పాన్ పానిస్కస్), ఉగాండాలో నివసిస్తున్న ఆరు అడవి చింపాంజీలు
(పాన్ ట్రోగ్లోడైట్స్) సహా 24 మంది మానవ శిశువుల ఏడుపును రికార్డు చేసి.. స్పీకర్స్ ద్వారా మొసళ్లకు వినిపించారు. దీంతో శబ్దం యొక్క మూలాన్ని వెతకడం ద్వారా ఏడుపులకు ప్రతిస్పందించిన క్రోకొడైల్స్.. వేగంగా లౌడ్‌స్పీకర్‌ను సమీపించాయి.
మూడింట ఒక వంతు మొసళ్లు తీవ్రంగా బాధపడ్డ మానవ శిశువులు, కోతుల ఏడుపులకు ప్రతిస్పందించాయి. ఆశ్చర్యకరంగా మానవుల కంటే మొసళ్లు ఏడుపులో బాధను గుర్తించడంలో మెరుగ్గా కనిపించాయి. నిజంగా పిల్లలు బాధలో ఉన్నారా? ఏదైనా హాని కలిగే అవకాశం ఉందా? అని కూడా చెప్పగలుగుతున్నాయని తెలిపారు శాస్త్రవేత్తలు. ఆందోళనతోనే సమీపిస్తున్నాయి కానీ రక్త దాహంతో కాదని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇక మానవ శిశువులతో అనుభవం ఉన్న హ్యూమన్ వాలంటీర్లను ఒకే రికార్డ్ చేసిన ఏడుపులను వినమని, శబ్దాల ద్వారా తెలియజేయబడిన బాధ స్థాయిని అంచనా వేయమని అడిగినప్పుడు.. శబ్దాలను అంచనా వేయడానికి మొసళ్ళ కంటే భిన్నమైన లక్షణాలను ఉపయోగించారు. కేకల పిచ్ ఆధారంగా ఎక్కువగా నిర్ణయాలు తీసుకుంటారు. పిచ్ అనేది బాధకు ఒక ఆధారం.. అయితే ఇది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. ఇది మొసళ్లచే గ్రహించబడిన దాని కంటే తక్కువ విశ్వసనీయతను కలిగిస్తుంది.