BigBoss: బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..

by Satheesh |   ( Updated:2023-05-19 08:19:35.0  )
BigBoss: బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: గతంలో బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ.. తాజాగా మరోసారి ఈ షోపై విరుచుకుపడ్డారు. సమయాన్ని వృధా చేసే కార్యక్రమం బిగ్ బాస్ షో అంటూ ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ షోను మళ్లీ బూతుల స్వర్గంగా చేస్తారా..? అని ప్రశ్నించాడు. అసలు ఈ షోతో ఏం సందేశమిస్తున్నారో ప్రేక్షకులు ప్రశ్నించాలని సూచించారు. కాసులకు కక్కుర్తిపడే వారు ఉన్నంత కాలం ఇలాంటి షోలు వస్తూనే ఉంటాయని అన్నారు. కాగా, నారాయణ గతంలో కూడా బిగ్ బాస్ షోపై, హోస్ట్ నాగార్జునపై ఇలాంటి తరహా వ్యాఖ్యలే చేశారు. వల్గర్ కంటెంట్‌కు నిలయంగా బిగ్ బాస్ మారిందని విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే, తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. 6వ సీజన్ ఆదివారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమైంది. 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టారు.

Advertisement

Next Story