ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. నటి కామెంట్స్ వైరల్

by Anjali |   ( Updated:2023-05-15 09:24:30.0  )
ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. నటి కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పల్లెటూరు నుంచి వచ్చిన నటి కవిత.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ సమయంలోనే వందల కోట్ల ఆస్తి ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. కాగా.. తాజాగా కవిత ఓ ఇంటర్వ్యూలో హాజరై తన జీవితంలో జరిగిన బాధకరమైన విషయాలను పంచుకున్నారు.

‘‘ నా చిన్న వయస్సులోనే అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చాను. 20ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. నా భర్తకు కోట్ల ఆస్తులు ఉన్న మాట వాస్తవమే. మేము 11 దేశాల్లో ఆయిల్ బిజినెస్ నడిపించేవాళ్లం. నా భర్త నన్ను ఒక మహారాణిలా చూసుకునేవాడు. నా ఇష్టాలన్నింటినీ గౌరవించేవాడు. కానీ ఒక్కసారిగా మా జీవితంలో కష్టాలొచ్చాయి. 7ఏళ్ల కిందట బిజినెస్ లాస్ కావడంతో దాదాపు 132 కోట్ల రూపాయలు నష్టపోయాం. దీంతో కొన్ని ఆస్తులు కూడా అమ్ముకోవలసి వచ్చింది.

అప్పుడు మా ఆయన 11 రోజులు కోమాలోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో కరోనా వల్ల నా కుమారుడు మరణించాడు. బాబు చనిపోయిన 10 రోజులకే నా భర్త కూడా చనిపోయాడు. ఆ సమయంలో బాధ తట్టుకోలేక చాలా సార్లు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ నా కుమార్తైలను గురించి ఆలోచించి ఆగాను. ఆ బాధల నుంచి నేను కోలుకోవాలంటే సినిమాల్లో మళ్లీ బిజీగా ఉంటనే సాధ్యమవుతుంది. అందుకని సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. మంచి ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తాను’’ అంటూ చెప్పుకొచ్చారు.

Read more: ఒకే కాన్పులో.. ఒకే పోలికలు ఉన్న ముగ్గురు కవలలకు జన్మనిచ్చిన తల్లీ

23 ఏళ్ల తర్వాత తిరిగి బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న జ్యోతిక

Advertisement

Next Story