- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవన్నీ తట్టుకోలేకపోయా.. అందుకే ఆ విషయం బయట పెట్టాల్సి వచ్చింది: సమంత
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇటీవల మయోసైటీస్ వ్యాధి తగ్గడంతో మళ్లీ యాక్టివ్ అవుతుంది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. అంతేకాకుండా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించింది. ప్రస్తుతం పలు ఈవెంట్స్‌కు హాజరవుతూ అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది.
తాజాగా, ఢిల్లీలో జరిగిన ఓ వేడుకలో సమంత పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ ప్రతిరోజు నేను 10 రకాలు పనులు చేస్తాను. ఐదు గంటలపాటు మాత్రమే నిద్రపోతాను. నా కెరీర్‌లో కొన్ని బాధపడిన సంవత్సరాలు ఉన్నాయి. దానివల్ల సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఆస్వాదించలేక పోయా. సక్సెస్ సాధించినప్పటికీ నా వల్ల వచ్చింది కాదనే భ్రమలో ఉండేదాన్ని. నటిగా దాదాపు 14 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. అయితే నేను లేడీ ఓరియెంటెడ్‌గా నటించిన యశోద సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోయాను.
ఈ క్రమంలో చాలా రూమర్స్ వచ్చాయి. అవన్నీ తట్టుకోలేకపోయా తప్పనిసరి పరిస్థితుల్లో నా వ్యాధి గురించి బయటపెట్టక తప్పలేదు అంతే కానీ మరేమి లేదు. అలాగే యశోద సినిమా నిర్మాత నువ్వు ప్రమోషన్స్ చేయకపోతే సినిమా ఫ్లాప్ అవుతుందని అనడంతో ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ తర్వాత ట్రీట్‌మెంట్ కోసం ఇంట్లోనే ఉండిపోయాను’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా, సమంత, తమిళ హీరో విజయ్ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.