మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' టైటిల్ సాంగ్‌పై వివాదం

by GSrikanth |
మెగాస్టార్ వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్‌పై వివాదం
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయడానికి మేకర్లు సిద్ధమయ్యారు. మాస్ మహరాజ్ రవితేజ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. మెగాస్టార్ సరసన శ్రుతీ హాసన్ నటించింది. అయితే, షూటింగ్ పూర్తిచేసుకుని విడుదల సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై వివాదం రాజుకుంది. ఈ సినిమా టైటిల్ సాంగ్‌పై ప్రముఖ రచయిత యండమూరి విమర్శలు చేశారు. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ రాసిన చంద్రబోస్ ఏ పురుణా కథలు చదివి ఈ పాట రాశారని విమర్శించారు. కచ్చితంగా ఇది శివ దూషణే అవుతుందని యండమూరి మండిపడ్డారు. దీంతో వెంటనే స్పందించిన చంద్రబోస్ యండమూరి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. అధ్యయనం చేయాల్సిన పాటను అవమానించొద్దని అన్నారు. అభినందించడం మాని సాహిత్యాన్ని విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. అర్థం తెలియకుండా మాట్లాడే వాళ్లకు ఏం చెబుతామని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కాదని.. 30 ఏళ్ల కిందటే ఇలాంటి పద ప్రయోగం చేశానని గుర్తుచేశారు.

Advertisement

Next Story