'RC15' సెట్‌లో గొడవలు.. అలిగి వెళ్లిపోయిన రామకృష్ణ

by GSrikanth |
RC15 సెట్‌లో గొడవలు.. అలిగి వెళ్లిపోయిన రామకృష్ణ
X

దిశ, సినిమా : రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా రాబోతున్న చిత్రం 'RC15'. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు తాజాగా బ్రేకులు పడ్డట్లు తెలుస్తోంది. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 40 శాతం షూటింగ్ జరపుకోగా.. టాప్ టెక్నీషియన్, ప్రొడక్షన్ డిజైనర్‌ రామకృష్ణ తాజాగా చిత్రంనుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకోసం భారీ సెట్స్ నిర్మించిన విషయంలోనే శంకర్‌తో విభేదాలు తలెత్తాయని, దీంతో మరో మాట లేకుండా రామకృష్ణ వెళ్లిపోయినట్లు టాక్ వినిపిస్తుండగా.. ఆయన ప్లేస్‌లో మరో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్‌ను తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed