కత్రినా కైఫ్ వల్లే నా కెరీర్ నాశనమైంది.. జరీన్ షాకింగ్ కామెంట్స్

by samatah |   ( Updated:2023-07-27 08:34:30.0  )
కత్రినా కైఫ్ వల్లే నా కెరీర్ నాశనమైంది.. జరీన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : కత్రినా కైఫ్‌ పోలికలను కలిగివుండటమే తన కెరీర్‌ ఎదగకపోవడానికి కారణం అంటోంది నటి జరీన్ ఖాన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. వ్యక్తిగత, కెరీర్ అనుభవాలను అభిమానులతో పంచుకుంది. ‘మోడల్‌గా కెరీర్ ప్రారంభించడం వల్లే నాకు త్వరగా అవకాశాలు రాలేదు. నటిగా అరంగేట్రం చేసిన తర్వాత కత్రినా కైఫ్‌తో పోల్చారు. ఈ కారణంగా నాకు సొంత గుర్తింపు దక్కకుండా పోయింది. ఒక రకంగా ఆ పోలికల వల్లే పరిశ్రమలో నా వ్యక్తిత్వాన్ని, పనిని నిరూపించుకునే అవకాశం లేకుండాపోయింది. ఇదే నన్ను పోటీలో లేకుండా చేసి వెనకకు నెట్టేసింది. ఇది అక్షరాలా నిజం’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది. అలాగే తనను కత్రినతో పోల్చడాన్ని ఎప్పుడూ తప్పు పట్టలేదని, తనలో స్టార్ నటిని చూసుకోవడం సంతోషంగానే ఉంటుందన్న ఆమె.. కత్రినకు తాను పెద్ద అభిమానినంటూ కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది.

Advertisement

Next Story