జడ్జీల మీద కామెంట్సే ఎక్స్ ట్రా జబర్దస్త్ క్లోజ్ కావడానికి కారణమా? మల్లె మాల అసలేం చేయబోతుందంటే?

by Jakkula Samataha |
జడ్జీల మీద కామెంట్సే ఎక్స్ ట్రా జబర్దస్త్ క్లోజ్ కావడానికి కారణమా? మల్లె మాల అసలేం చేయబోతుందంటే?
X

దిశ, సినిమా : జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకులకు బిగ్ షాక్ తగిలింది. పాపులర్ షోగా మంచి పేరు తెచ్చుకున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో త్వరలో క్లోజ్ చేయనున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ షో నుంచి ఇంద్రజ‌ను తొలిగించారు. త్వరలోనే సిరి, స్కిట్ బాగా చేయని పలువురు కమెడియన్స్‌ను కూడా షో నుంచి తొలిగించనున్నారని టాక్. అయితే ఎక్స్ ట్రా జబర్దస్త్ షోను ఎందుకు క్లోజ్ చేస్తున్నారో తెలియక చాలామంది అయోమయంలో పడిపోయారు. దీని వెనుక గల కారణం ఏమిటో ఎవరికీ తెలియడం లేదు. కాగా, దీనికి సంబంధించిన అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2013లో స్టార్ట్ అయిన జబర్దస్త్ షో ఎంత పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనికి వస్తున్న ఆదరణ చూసిన మల్లెమాల ఈ కామెడీ షోను రెండు భాగాలుగా విభజించి, కామెడీ పండించింది. అయితే 2020 తర్వాత నుంచి ఈ షో నుంచి ఒక్కొక్కరు వెళ్లిపోవడం జరుగుతోంది. యాంకర్ అనసూయ, నాగబాబు, రోజు, కమెడియన్స్ ఆది, సుడిగాలి సుధీర్, శ్రీను, రాంప్రసాద్ వీరందరూ షో నుంచి వెళ్లిపోయారు. అంతే కాకుండా కామెడీ కూడా చప్పగా సాగడం, కంటెంట్ సరిగ్గా లేక జడ్జ్ ల మీద యాంకర్ల మీద కామెంట్స్ వేయడం ఎక్కువ అవుతోంది. దీంతో టీఆర్‌పీ రేటింగ్ కూడా దారుణంగా పడిపోతుంది. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలో భాగంగా మల్లెమాల, ఈటీవీ. ఒక షోని తీసేయాలని, ఉన్న వాటిలో బెస్ట్ టీమ్‌తో కామెడీ చేయించాలని ప్లాన్‌ చేసింది. చాలా రోజులుగా ఈ కసరత్తులు జరుగుతున్నాయి. జూన్‌ నుంచి దాన్ని ఇంప్లిమెంట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

జబర్దస్త్ షో ఒక్కటే శుక్ర, శని వారం టెలికాస్ట్ కాగా, గురు వారం ఢీ షో ప్రసారం కానున్నది. ఢీని రెండుగా చేసి టెలికాస్ట్ చేయనున్నట్లు సమాచారం. అలాగే శని వారం రావాల్సిన సుమ అడ్డాని మంగళ వారానికి మార్చగా, సోమవారం ఆలీతో సరదాగా షోను టెలికాస్ట్ చేయబోతున్నారంట. ఇక వీటితో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ యదావిధిగా నడుస్తుంది. ఇందులో ఇంద్రజనే జడ్జిగా వ్యవహరించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed