‘కన్నప్ప’లో కమెడియన్స్.. సురేఖ వాణి పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2023-11-02 13:58:06.0  )
‘కన్నప్ప’లో కమెడియన్స్.. సురేఖ వాణి పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్‌, మోహన లాల్, శివ రాజ్ కుమార్‌లతో సహా పలువురు స్టార్ హీరోలు నటించనున్నారు. అయితే రీసెంట్‌గా విష్ణు షూటింగ్‌లో గాయపడటంతో చిత్రీకరణ నిలిపివేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే.. దీనిపై క్లారిటీ ఇస్తూ ప్రస్తుతం విష్ణు కోలుకుంటున్నాడని మోహన్ బాబు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ మూవీలో సురేఖ వాణి కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేరుగా సురేఖనే తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు ‘మోహన్ బాబు, బ్రహ్మానందం, సప్తగిరి, రఘు బాబు’ వంటి కమెడియన్స్‌తో కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. కన్నప్ప సినిమాలో నేను భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా.. శివ బాలాజీతో సైతం వీరందరు ‘కన్నప్ప’ షూటింగ్ కొరకు న్యూజిలాండ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story