Jailer మూవీ చూసిన CM Stalin.. డైరెక్టర్ పై ప్రశంసల జల్లు

by Shiva |   ( Updated:2023-08-12 03:46:26.0  )
Jailer మూవీ చూసిన CM Stalin.. డైరెక్టర్ పై ప్రశంసల జల్లు
X

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రిజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊర మాస్ ఎంటర్ టైనర్ జైలర్ మూవీ విడుదలైన తొలిరోజు నుంచే కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. అన్ని థియేటర్లలో ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దుసుకుపోతోంది. దీంతో చాలా కాలం తర్వాత రజనీ లెవల్ కు సమంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి.

తమన్నా, రమ్యకృష్ణ, సునీల్, వసంత్ రవి, యోగిబాబు ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషించారు. రిటైర్డ్ పోలీస్ అధికారిగా రజనీకాంత్ ఎప్పటిలాగే సరికొత్త లుక్ తో అదరగొట్టారు. మూవీలో కొన్ని చోట్ల రజనీ డైలాగులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. తాజాగా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం జైలర్ మూవీని వీక్షించారు. అదేవిధంగా తన అనుభూతిని, సంతోషాన్ని తెలియజేస్తూ సినిమా విశేషాలను పంచుకుంటూ రివ్యూ కూడా ఇచ్చారు.

సీఎం స్థాయి వ్యక్తి తమ మూవీపై ప్రశంసలు కురిపించడంతో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సీఎం స్టాలిన్ జైలర్ చిత్రం చూసిన అనంతరం ఆయన అభినందించారు అంటూ ట్విట్టర్ లో కూడా షేర్ చేశాడు. 'జైలర్ చిత్రాన్ని వీక్షించిన సీఎం స్టాలిన్ సర్ కి నా కృతజ్ఞతలు. మీరిచ్చిన స్ఫూర్తికి, ప్రశంసలకు రుణపడి ఉంటాను. మీ అభినందనలతో రజనీకాంత్ సర్, కళానిధి మారన్ సర్, ఇతర చిత్ర యునిట్ అంతా చాలా సంతోషంగా ఉన్నాం' అంటూ నెల్సన్ తన స్పందన తెలియజేశారు.

Also Read: మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కించుకున్న ‘Sita Ramam’..

Advertisement

Next Story