- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chiyan Vikram: తంగలాన్ రివ్యూ.. చియాన్ విక్రమ్ సక్సెస్ అయినట్టేనా?
నటీనటులు: విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తు, పశుపతి, డానియల్
సాంకేతిక నిపుణులు: సంగీతం: జీవి ప్రకాష్‌కుమార్, సినిమాటోగ్రఫీ: ఎ.కిషోర్ కుమార్, నిర్మాతలు: జ్ఞానవేల్ రాజా, జ్యోతి దేశ్ పాండే, దర్శకత్వం: పా.రంజిత్
దిశ, సినిమా: వైవిధ్యమైన కథాంశాలతో, విభిన్నమైన పాత్రలతో అలరిస్తుంటాడు కథానాయకుడు విక్రమ్. ఆయన సినిమా అంటే ప్రేక్షకులు డిఫరెంట్ సినిమానే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. దర్శకుడు పా రంజిత్ కూడా తనదైన శైలిలో ఎవరూ టచ్ చేయని కొత్త కథాంశాలనే తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో రూపొందిన చిత్రమే 'తంగలాన్'. ఈ చిత్రం ప్రచారచిత్రాలు మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఆగస్టు 15న ఈ గురువారం తంగలాన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక తంగాలన్ కథ ఏమిటి? ప్రేక్షకులను ఎంత వరకు అలరించింది? అనేది తెలుసుకుందాం.
కథ: కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో కొనసాగే కథ ఇది. 1850 సంవత్సరంలో బ్రిటీష్ పాలనలో కర్ణాటక దగ్గర వున్న వేపూరు ఊరులోని ఓ అటవిక తెగకు చెందిన నాయకుడు తంగలాన్ (విక్రమ్), అతని భార్య గంగమ్మ (పార్వతి తిరువొత్తు) వాళ్ల పిల్లలు తమకున్న కొద్ది వ్యవసాయ భూమిలో పంట సాగు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతుంటారు. అయితే ఓసారి ఎవరో అపరిచిత వ్యక్తులు కష్టపడి పండించిన పంటను నిప్పు పెట్టి కాల్చేస్తారు. ఇలాంటి కష్టకాలంలోనే భూమి జమీందారు పన్నుకట్టలేదని భూమిని అన్యాక్రాంతం చేసుకుంటాడు. అయితే ఓ తెల్లదొర అటవీ ప్రాంతంలోని బంగారం కోసం తవ్వకాలు జరిపితే భారీ మొత్తంలో కూలీ చెల్లిస్తానని,బంగారంలో వాటా కూడా ఇస్తానని ఆశ చూపుతాడు. అయితే అడవిలో బంగారానికి నాగజాతికి చెందిన ఆరతి ( మాళవిక మోహనన్) రక్షకురాలిగా వుంటుంది. వీళ్లు బంగారాన్ని చేజిక్కించుకోకుండా ఆమె అడ్డుకుంటుంది. ఇక బంగారం కోసం అడవికి వెళ్లిన వీళ్లకు బంగారం దొరికిందా? లేదా ఆరతి నుంచి ఎలా కాపాడుకున్నారు? ఆరతిని ఎదరించి బంగారు ఎలా చేజిక్కించుకున్నారు అనేది మిగతా కథ.
విశ్లేషణ: బంగారం వేట నేపథ్యంలో ఈ కథ వున్నా అంతర్లీనంగా స్వేచ్ఛ కోసం అణగారిన వర్గం చేసే పోరాటం ఈ సినిమాలో కనిపిస్తుంది. సినిమాను ఎంతో సహజంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు దర్శకుడు. కథ కోసం ఎంచుకున్న నేపథ్యం తగ్గట్టుగా వుండేటట్టు ప్రతిది ప్లాన్ చేసుకన్నాడు. సినిమా ఆసక్తిగా ప్రారంభమైన రాను రాను స్క్రీన్‌ప్లే స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్ల ఇంటర్వెల్‌కు వచ్చేసరికి పట్టు తప్పినట్లుగా అనిపిస్తుంది. పూర్తి సహజత్వంగా కథనం నడిపించటంలో దర్శకుడు శ్రద్ద పెట్టడం వల్ల కమర్షియల్ అంశాల మీద దృష్టి పెట్టినట్లుగా అనిపించలేదు. బంగారపు కొండ దానికి తవ్వకాల మీద నడిచే కథలో.. ఇంకాస్త బలమైన సన్నివేశాలు వుంటే రక్తికట్టేది. కథ, కథనాలు కొనసాగుతున్న ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. సినిమాలో వున్న అతి సహజత్వం వల్ల.. సినిమా అప్పుడప్పుడు డాక్యుమెంటరీ ఫీల్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా కొనసాగినా.. ద్వితీయార్థం సాగతీసినట్లుగా అనిపించింది. ఇక ప్రీ క్లైమాక్స్, పతాక సన్నివేశాలను ఎటువంటి క్లారిటీ లేకుండా గజిబిజీగా చిత్రీకరంచినా ఫీల్ కలుగుతుంది. ఇక తంగలాన్ పాత్ర మేకోవర్ కోసం విక్రమ్ పడ్డ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. అలాంటి పాత్ర చేయడంలో విక్రమ్ దిట్ట అని మరోసారి నిరూపించుకున్నాడు. ఆయన వస్త్రాలు కూడా అచ్చం ఆదివాసీ మనిషిలాగే కనిపించాడు. గంగమ్మ పాత్రలో పార్వతి, ఆరతి పాత్రలో మాళవిక మెహన్ ఆకట్టుకున్నారు.
ఫైనల్‌గా: ఈ సినిమా నేపథ్యం కొత్తగా వున్నా ప్రజెంటేషన్‌లో మరింత శ్రద్ద పెట్టి వుంటే బాగుండేది. బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల, సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దలేకపోవడం వల్ల సినిమా అక్కడక్కడ డాక్యుమెంటరీ ఫీల్ అనిపిస్తుంది. సినిమా కథనంలో కాస్త వేగం వుంటే, ఖచ్చితంగా తంగలాన్ పూర్తిగా అందర్ని ఆకట్టుకునేది. దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని అందుకు తగ్గ కథనంతో బలంగా చెబితే... బాగుండేది.. తప్పుడు అందర్ని అలరించే సినిమాగా నిలిచేది
రేటింగ్ 2/5