ఆడిషన్‌కు పిలిచి అవమానించారు.. ఇండస్ట్రీలో వివక్షత ఉందంటున్న నటి

by Prasanna |   ( Updated:2023-05-19 12:32:14.0  )
ఆడిషన్‌కు పిలిచి అవమానించారు.. ఇండస్ట్రీలో వివక్షత ఉందంటున్న నటి
X

దిశ, సినిమా : ఒక టాల్కమ్ పౌడర్ బ్రాండ్ ప్రకటన కోసం ఆడిషన్ వెళ్లినపుడు తనను తిరస్కరించడంపై చిత్రాంగద సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు కెరీర్ కొత్తలో పాల్గొ్న్న పౌడర్ యాడ్ కోసం అనుభవం లేనివారు తనతో పోటీపడ్డారని, అయినప్పటికీ తాను ఇగోకు పోకుండా సాధారణంగానే భావించానని చెప్పింది. అయితే అక్కడ నిర్వాహకులు వ్యవహరించే తీరు మాత్రం వివక్షపూరితంగానే అనిపించిందన్న నటి.. ‘నన్ను రిజెక్ట్ చేసినపుడు ఫర్వాలేదు అనుకున్నా. ఎదుకంటే నేను దానికి తగినంతగా న్యాయం చేయలేననే భావించాను. అయితే అక్కడ నన్ను తక్కువ భావనతో చూడటం నచ్చలేదు’ అని చెప్పింది. అయితే ఆ సంఘటన తర్వాత వెంటనే ఓ మంచి సినిమా ఆఫర్ రావడం, తానేంటో నిరూపించుకోవడం జరిగిపోయిందని తెలిపింది. ఇదిలావుంటే.. ఇటీవల మూడేళ్ల గ్యాప్ తీసుకున్న నటి మళ్లీ సినిమాల్లోకి తిరిగి వస్తానని అనుకోలేదని, ఫోన్ నెంబర్ కూడా మార్చేసినట్లు వెల్లడించింది.ఆడిషన్‌కు పిలిచి అవమానించారు.. ఇండస్ట్రీలో వివక్షత ఉందంటున్న నటి

Read more:

ఆ రోజు నాకు బట్టలు కూడా ఇవ్వలేదు.. దారుణంగా అవమానించారు

Advertisement

Next Story