చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి.. శ్రీరెడ్డి సంచలన పోస్ట్!

by Hamsa |   ( Updated:2024-06-19 07:15:22.0  )
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి.. శ్రీరెడ్డి సంచలన పోస్ట్!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ ఉదయం మరణించినట్లు సమాచారం. అయితే లంగ్స్ డ్యామేజ్ కావడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ విషయం బయటకు రావడంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, సోషల్ మీడియా సెన్సేషన్ శ్రీరెడ్డి శిరీష్ మరణంపై స్పందిస్తూ సంచలన పోస్ట్ షేర్ చేసింది. ఫేమ్‌బుక్ ద్వారా ఓ పోస్ట్ పెట్టడంతో పాటుగా శ్రీజతో శిరీష్ కలిసి ఉన్నప్పుడు తీసుకున్న పిక్‌ను షేర్ చేసింది. ‘‘ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఇక లేరు. ఇప్పటికైనా నీకు శాంతి దొరకిందిరా శిరీష్. అందరూ నిన్ను మోసం చేశారు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా అది చూసిన మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

శ్రీజ మోసం చేసిందని అంటున్నావా ఇద్దరు ఇష్టంతో విడిపోయాక అలా ఎలా అంటావని మండిపడుతున్నారు. కాగా.. శిరీష్ భరద్వాజ్ శ్రీజ మొదటి భర్త అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు ప్రేమించుకుని పెద్దలకు చెప్పకుండా 2007లో పెళ్లి చేసుకున్నారు. శ్రీజ అప్పట్లో శిరీష్ కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఈ ఘటన సంచలనం సృష్టించింది. వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. కానీ శ్రీజ, శిరీష్ కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. మనస్పర్థలు రావడంతో 2014లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక బిడ్డ భాద్యతను శ్రీజనే తీసుకుంది.

కూతురు బాధను చూడలేక చిరు 2016లో ప్రముఖ వ్యాపారవేత్త కల్యాణ్ దేవ్‌కు ఇచ్చి బెంగళూరులో అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. వీరికి కూడా ఓ కూతురు పుట్టింది. అయితే గత కొద్ది కాలంగా కల్యాణ్ దేవ్, శ్రీజ విడిగా ఉండటంతో విడాకులు తీసుకుని విడిపోయారనే వార్తలు వస్తున్నాయి. కానీ వీరిద్దరు తమ విడాకులను అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. కానీ శ్రీజ తన ఇద్దరు కూతుళ్లతో చిరంజీవి ఇంట్లో ఉంటూ ఓ బిజినెస్ స్టార్ చేసింది. ఇక కల్యాణ్ దేవ్ మాత్రం ఇంట్లోనే ఉంటూ.. అప్పుడప్పుడు తన కూతురిని ఇంటికి తీసుకొచ్చుకుని తనతో సమయం గడుపుతున్నాడు.

Advertisement

Next Story