లావణ్య విషయంలో వరుణ్ చేసిన పనికి నేను ఇప్పటికీ కోపంగా ఉన్నాను.. చిరంజీవి సంచలన కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-08-13 09:10:06.0  )
లావణ్య విషయంలో వరుణ్ చేసిన పనికి నేను ఇప్పటికీ కోపంగా ఉన్నాను.. చిరంజీవి సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్ సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠిల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి మెగా కోడలి స్టేటస్‌ను లావణ్య త్రిపాఠి బాగా ఎంజాయ్ చేస్తుంది. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ విజయం కోసం తాపత్రయ పడుతున్నాడు. కానీ, హిట్ మాత్రం కొట్టలేక పోతున్నాడు. ప్రజెంట్ ‘మట్కా’ మూవీ షూటింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక లావణ్య విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత ‘మిస్ ఫర్‌ఫెక్ట్’ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. కానీ, ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ ప్రకటించకుండా సైలెంట్‌గా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ అడపాదడపా పోస్టులు పెడుతుంది. వరుణ్‌కు షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా వెకేషన్‌కు వెళ్తూ ఈ జంట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే లావణ్యతో వరుణ్ తేజ్ లవ్ విషయంలో చిరంజీవి కోప్పడ్డాడాడని స్వయంగా అతనే ఓ సందర్భంలో వెల్లడించాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఇదిలా ఉంటే.. గతంలో వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. వరుణ్ తేజ్ లవ్ మ్యారేజ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అందులో భాగంగా.. యాంకర్ సుమ ఆయన్ని ఓ ప్రశ్న అడిగారు. చిరు లీక్స్ అంటే అందరికీ ఇష్టం. అన్ని విషయాలు లీక్ చేసే మీరు వరుణ్ తేజ్- లావణ్య లవ్ మ్యాటర్ ఎందుకు లీక్ చేయలేదని అడిగింది. దానికి చిరంజీవి మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ ప్రతి విషయం నాకు చెబుతాడు. నేను తనకు స్ఫూర్తి అంటాడు. వాళ్ళ నాన్నతో చెప్పుకోలేని విషయాలు కూడా నాకు చెబుతాడు. అయితే లావణ్యతో ప్రేమ విషయం మాత్రం నాకు చెప్పలేదు. ఆ విషయంలో నాకు ఇప్పటికీ వాడి మీద కోపం ఉంది, అని చిరంజీవి అన్నారు. దీంతో వెంటనే వరుణ మైక్ అందుకుని గౌరవంతో కూడిన భయం వలన నా ప్రేమ విషయం దాచాను. కానీ మొదట చెప్పింది పెదనాన్నకే అని వివరణ ఇచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

Read More..

Renu Desai: అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతులను మూయించడమేనా స్వేచ్ఛ అంటే.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్

Advertisement

Next Story