వెకేషన్‌ టూర్‌కు బయలుదేరిన Chiranjeevi .. మనవరాలితో ఆడుకోక అవసరమా అంటూ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-07-08 09:05:48.0  )
వెకేషన్‌ టూర్‌కు బయలుదేరిన Chiranjeevi .. మనవరాలితో ఆడుకోక అవసరమా అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘భోళా శంకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జూలై 6న భోళా శంకర్ మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్ పూర్తి చేశాడు. కాగా, ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్స్ విడుదల కానుంది. ప్రమోషన్స్ మొదలు పెట్టకముందే చిరు, భార్యతో ఓ హాలిడే ట్రిప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా, జూలై 7న సురేఖతో కలిసి చిరు హాలీడే ట్రిప్‌కు అమెరికాకు బయలుదేరారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిరంజీవి ఫ్లైట్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ‘‘నా తదుపరి సినిమా మొదలు పెట్టడానికి ముందు ఒక చిన్న హాలిడే ట్రిప్ కి వెళ్లి రిఫ్రెష్ అయ్యి వస్తాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం చిరు, సురేఖ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అది చూసిన నెటిజన్లు మనవరాలితో ఆడుకోక అసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మీ దంపతుల మధ్య ఉన్న అన్యోన్యత విడాకులు తీసుకునే జంటలకు ఇన్స్పిరేషన్ అని అంటున్నారు.

Advertisement

Next Story