Balakrishna: బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు మెగాస్టార్‌కు ఆహ్వానం..

by Hamsa |
Balakrishna: బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు మెగాస్టార్‌కు ఆహ్వానం..
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 1న వేడుక జరగనుంది. దీనిని హైదరాబాద్ హైటెక్స్ నోవాటెల్ హోటల్‌లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌ని ప్లాన్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. దీనిని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫెడరేషన్ నుంచి భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్ , రాజా రవీంద్ర, జెమినీ కిరణ్, కె. ఎల్. నారాయణ, మాదాల రవి, అనుపం రెడ్డి, నిర్మాత సి కళ్యాణ్, డైరెక్టర్ వీర శంకర్, నిర్మాత అశోక్ కుమార్, అనిల్ వల్లభనేని, వీర శంకర్.. చిరంజీవికి ఇచ్చారు. అదే విధంగా నాలుగు సంస్థల పెద్దలతో ముచ్చటించిన చిరు చేస్తున్న కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed