Chiranjeevi- Srikanth Odela: చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమా.. హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన అందాల తార..?

by Kavitha |
Chiranjeevi- Srikanth Odela: చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమా.. హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన అందాల తార..?
X

దిశ, సినిమా: మెగా స్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషల్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని కొత్త జానర్‌లో తెరక్కించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరు ‘విశ్వంభర’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఆ మూవీ తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయడానికి చిరంజీవి కమిట్ అయ్యాడు. ఈ చిత్రం కూడా పూర్తయిన తర్వాత 2026 సమ్మర్‌లో శ్రీంకాత్ ఓదెల సినిమాని స్టార్ట్ చేసే ఉద్ధేశ్యంలో చిరంజీవి ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ చిత్రంతో అందరూ అనుకున్నట్లుగా శ్రీకాంత్ సక్సెస్ సాధిస్తాడా, మెగాస్టార్ మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా అనేది చూడాలి.

ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. మెగాస్టార్- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నయనతారను గానీ లేదంటే త్రిషను గానీ తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళిద్దరితో ఇంతకుముందు చిరు కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి వీళ్ల కాంబినేషన్‌ని రిపీట్ చేయడానికి శ్రీంకాత్ ఓదెల ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి త్రిష, నయన్‌లో ఫైనల్‌గా ఎవరిని ఓకే చేస్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed