- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఉత్సాహం రావట్లే.. చరణ్‌తో సినిమాపై చిరు సంచలన కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా 'గాడ్ ఫాదర్'. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎన్నో అంచనాల నడుమ 'గాడ్ ఫాదర్' సినిమా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియోటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇటీవలే అనంతపురంలో ఎంతో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం నిర్వహించారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆచార్య సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు చిరు.
చిరంజీవి మాట్లాడుతూ.. ''ఆచార్య సినిమా ఫలితం నన్ను ఏ మాత్రం బాధించలేదు. సినిమా హిట్ అయితే ఆనందపడటం, ప్లాప్ అయితే బాధపడిపోవడం లాంటివి కెరీర్ ప్రారంభంలో చేశాను. నా కెరీర్‌లోని మొదటి 15 ఏళ్లలోనే చాలా ఎదుర్కొన్నాను. శారీరకంగా, మానసికంగా అన్నింటిని ఎదుర్కోవడం, తట్టుకోవడం నేర్చుకున్నాను. అందుకే సినిమాకు సంబంధించి ఏ ఫలితమూ నాపై ప్రభావం చూపదు. సినిమా హిట్ అయితే తలకెక్కదు, ఫెయిల్ అయితే నన్ను బాధించదు. మనం ఎప్పుడు మన పనిలో బెస్ట్ ఇస్తాం. డైరెక్టర్ చెప్పిందే మనం చేస్తాం. కాకపోతే.. చరణ్, నేను కలిసి చేసిన మొదటి సినిమా హిట్ కాలేదనే చిన్న విచారం మాత్రం ఉంది. దీని ప్రభావం మేమిద్దం కలిసి మరో సినిమా చేయాడానికి మొదట ఉన్నంత ఉత్సహం ఉండకపోవచ్చు'' అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి.
ఇవి కూడా చదవండి : ఆ అనుభవమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది: Deepika Padukone