సల్మాన్ ఖాన్‌ పాత్రలో పవన్ కల్యాణ్.. చిరంజీవి రియాక్షన్ ఇదే!

by GSrikanth |   ( Updated:2022-10-13 02:03:49.0  )
సల్మాన్ ఖాన్‌ పాత్రలో పవన్ కల్యాణ్.. చిరంజీవి రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాడ్ ఫాదర్'. అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు కొట్టగొట్టి మెగాస్టార్ సత్తా ఏంటో మరోసారి బాక్సాఫీస్‌కు చూపించారు. అయితే, ఈ సినిమా విడుదలైన నాటినుంచి సల్మాన్ ఖాన్ పాత్రలో చిరు సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తే బాగుండు అని అభిమానులంతా అనుకోవడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. పంజా సినిమాలోని పవన్ కల్యాణ్‌ పాత్ర.. గాడ్‌ ఫాదర్‌లోని సల్మాన్ ఖాన్ పాత్రకు సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. తాజాగా.. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. బుధవారం పూరి జగన్నాథ్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూలో చిరు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ''సల్మాన్ ఖాన్ చేసిన పాత్రలో పవన్ కల్యాణ్ చేసినా బాగుండేది. ఒకవేళ నటించాలని కోరితే కల్యాణ్ కాదనేవాడు కాదేమో. కానీ, సల్మాన్ చేస్తే న్యాయంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చేవాడు. ఇతర భాషల్లో కూడా విడుదల చేసే ఆలోచన ఉండటం వల్ల సల్మాణ్‌ ఖాన్‌ను తీసుకున్నాం.'' అని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. కాగా, ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా సత్యదేవ్‌తో పాటు నయనతా, సునీల్, హైపర్ ఆది కీలక పాత్రలు పోషించారు.

Advertisement

Next Story