Chiranjeevi : రమ్యకృష్ణకు విలువైన వస్తువు ఇచ్చిన చిరంజీవి!

by Anjali |   ( Updated:2023-08-13 13:49:45.0  )
Chiranjeevi : రమ్యకృష్ణకు విలువైన వస్తువు ఇచ్చిన చిరంజీవి!
X

దిశ, సినిమా: తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి, రమ్యకృష్ణకు సంబంధించిన విషయం ఒకటి వైరల్ అవుతుంది. అప్పట్లో చిరంజీవి ఒక సందర్భంలో హీరోయిన్ మాధవి కారులో తన పక్కన కూర్చుని వెళ్లాడట. ఆది ఆయనకు కొంచెం అవమానంగా అనిపించి అప్పటి నుంచి మార్కెట్లోకి ఏ కొత్త కారు వస్తే అది కొనుక్కొని తన రేంజెంటో నిరూపించుకున్నేవాడట. అలా చిరంజీవి అప్పట్లో మూడు కోట్లు పెట్టి ఒక ఖరీదైన స్టైలిష్ కారును కొనుగోలు చేశారట. అయితే ఆ కారుని చిరు ఎవరిని ముట్టుకోనిచ్చేవాడు కాదట. చిన్న గీత పడ్డా కూడా వారిపై అరిచేవాడట. పని వారు కూడా చిరుకి భయపడి ఈ కారుని చాలా జాగ్రత్తగా తుడిచేవారట.

అలాంటి కారును రమ్యకృష్ణ కోసం ఇచ్చేశాడట చిరు. రజనీకాంత్ నటించిన ‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ ఎంట్రీ వెరైటీ‌గా స్టైలిష్ కారుతో ఉండాలని డైరెక్టర్ మార్కెట్లో ఉన్న కార్లు అన్నీ వెతికారట. కానీ ఏ ఒక్క కారు కూడా వారికి నచ్చలేదు. దీంతో రమ్యకృష్ణ ఓ పనిమీద చిరు ఇంటికి వెళ్లినప్పుడు ‘మీ కారు చాలా బాగుంది. మా షూటింగ్ కోసం ఇస్తారా’ అని అడిగిందట. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చిరంజీవి సరే తీసుకెళ్లుమని చెప్పాడట. అలా రమ్యకృష్ణ కోసం చిరంజీవి తనకు ఎంతో ఇష్టమైన కారును దాదాపు నెల రోజుల పాటు ఇచ్చేశాడట.

Read more : ‘భోళా శంకర్’ ఎఫెక్ట్.. ఇల్లు తాకట్టు పెట్టి మరీ చిరంజీవికి డబ్బులిచ్చిన నిర్మాత!

Advertisement

Next Story