Chiranjeevi: రొమాన్స్ చేయలేదని ఆ హీరోయిన్‌ను రూమ్‌కి పిలిచి చంప చెళ్లుమనేలా కొట్టిన చిరంజీవి..?

by Kavitha |
Chiranjeevi: రొమాన్స్ చేయలేదని ఆ హీరోయిన్‌ను రూమ్‌కి పిలిచి చంప చెళ్లుమనేలా కొట్టిన చిరంజీవి..?
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. 68 ఏళ్ల వయస్సులోనూ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ‘విశ్వంభర’ మూవీతో బిజీబిజీగా ఉన్నాడు. ఇటూ సినిమాలతో, అటు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ లైఫ్‌‌ను లీడ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే చిరంజీవి అప్పట్లో ఓ హీరోయిన్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడంట.. అంతటితో ఆగకుండా రూమ్‌కి పిలిచి మరీ కొట్టారంట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవి ఎంతోమంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వారితో ఎవరితో పడనంత ఇబ్బంది హీరోయిన్ నగ్మాతో పడ్డారంట. అప్పుడే టాలీవుడ్లోకి వచ్చిన నగ్మా .. ఎంత పెద్ద హీరో అయితే నాకేంటి అనే ప్రౌడ్ ఫీలింగ్లో ఉండేదట.. అలా మొదటిసారి నగ్మా చిరంజీవి సినిమాలో నటించిన సమయంలో చాలా పొగరు చూపించి ఈయనతో నేను నటించడం ఏంటి అని చాలా చీప్‌గా చూసేదట. అయినప్పటికీ చిరంజీవి.. అప్పుడే ఇండస్ట్రీకి వచ్చింది ఎందుకు గొడవ అని ఓపిగ్గా అవన్నీ భరించే వాడట. ఇక తర్వాత కొద్ది రోజులకు షూటింగ్‌కి టైం‌కి రాకుండా డైరెక్టర్‌తో పాటు మిగిలిన ఆర్టిస్టులను కూడా ఇబ్బంది పెట్టిందట. అంతేకాకుండా ఓ రోజు చిరంజీవితో రొమాంటిక్ సన్నివేశం ఉండగా అందులో నటించను అని చెప్పిందట. దాంతో చిరంజీవి ఓ రోజు రూమ్‌కి పిలిపించి ఏంటి నువ్వు బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావ్.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణిస్తున్నావని సైలెంట్‌గా ఉంటున్నాం. నువ్వు ఇలా నిర్మాతల డబ్బులు వృధా చేస్తూ ఆర్టిస్టులను ఇబ్బంది పెడుతూ ఉంటే ఎవరూ చూస్తూ ఊరుకోం అని అన్నారట.

ఇక చిరు మాటలు లెక్కచేయని నగ్మా తిక్క సమాధానం చెప్పడంతో మేకప్ రూమ్ లోనే చెంప చెల్లుమనిపించారట. ఆ తర్వాత షూటింగ్ నుండి ఇంటికి వెళ్లిపోయిన నగ్మా‌కి చిరంజీవి బ్యాగ్రౌండ్ మొత్తం ఆయన సన్నిహితులు చెప్పడంతో పొరపాటు అయిపోయిందని నెక్స్ట్ డే నుండి కరెక్ట్ టైం‌కి షూటింగ్‌కి వస్తూ అందరితో బాగా మాట్లాడిందట. అలా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నగ్మా చిరంజీవితో కాస్త పొగరుగా ప్రవర్తించిందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.



Next Story