33 ఏళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి- అమల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఇదే?

by Anjali |   ( Updated:2023-11-16 09:41:54.0  )
33 ఏళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి- అమల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఇదే?
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున మొదటి భార్య లక్ష్మికి విడాకులిచ్చి.. అనంతరం అమలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఫస్ట్ భార్యకు నాగ చైతన్య జన్మించగా.. అమలకు అఖిల్ పుట్టారు. అమల కేవలం వీరికి అమ్మగానే కాకుండా ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా కూడా రాణించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక నాగార్జున సరసన ‘కిరాయి దాదా, చినబాబు, శివ, నిర్ణయం, ప్రేమ యుద్ధం’ సినిమాల్లో, వెంకటేష్‌తో ‘రక్తతిలకం, అగ్గిరాముడు’, రాజశేఖర్‌తో ‘ఆగ్రహం’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కానీ మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటించిందన్న విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు. 1990 నవంబరు 14 న థియేటర్లలో గ్రాండ్ రిలీజైన ‘రాజా విక్రమార్క’ మూవీలో చిరంజీవి-అమల కలిసి నటించారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చవిచూసింది. కాగా ఈ సినిమా విడుదలై 33 ఏళ్లు దాటిందని చెప్పుకోవచ్చు.

Advertisement

Next Story