స్టార్ హీరోయిన్ ఆస్తి కబ్జా.. ఆపై ఆమె వీక్‌నెస్‌ను ఆసరా చేసుకొని బెదిరింపులు

by Nagaya |
స్టార్ హీరోయిన్ ఆస్తి కబ్జా.. ఆపై ఆమె వీక్‌నెస్‌ను ఆసరా చేసుకొని బెదిరింపులు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆస్తులను చూస్తే ఎవరికైనా ఆశపుడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందునా ఒంటరి మహిళలైతే ఇక హద్దే ఉండదు. ఇదే మాదిరిగా జరిగింది సినీ నటి గౌతమికి. భాషలతో సంబంధం లేకుండా ఒకప్పుడు అగ్ర హీరోయిన్‌గా వెలుగొందింది గౌతమి. ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ భాటియాను వివాహం చేసుకోని సుబ్బలక్ష్మి అనే కూతురికి జన్మనిచ్చింది గౌతమి. కొంతకాలానికే భార్యభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కూతురుతో కలిసి ఉన్న ఆమె.. 2016లో తమిళ స్టార్ హీరో కమల్ హాసన్‌తో కలిసి సహజీవనం చేసింది. ఆ తర్వాత అతడితోనూ విడిపోయింది.

కాగా, తమిళనాడులో ఉంటున్న గౌతమి కొన్నాళ్ల క్రితం అనారోగ్యం పాలయింది. ఆమెకు శ్రీపెరుంబూర్ సహా వివిధ ప్రాంతాల్లో సుమారు. రూ.46 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అయితే అనారోగ్యానికి గురైన సమయంలో తన ఆస్తులను అమ్మాలని చూసిన గౌతమి.. అలగప్పన్ అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ను సంప్రదించింది. కానీ అలగప్పన్ గౌతమి ఆస్తులపై కన్నేసి.. ఆమె సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలతో రూ.25 కోట్ల విలువైన ఆస్తులను కాజేశాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న గౌతమి అతడిని నిలదీయగా.. తనకు రాజకీయ అండదండలు ఉన్నాయని.. ఎక్కువగా మాట్లాడితే నిన్ను, నీ కూతురిని చంపేస్తానని బెదిరించాడు. దీంతో అతడిపై చెన్నై పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది గౌతమి. అలగప్పన్ తమ ఆస్తులను కబ్జా చేయడంతోపాటు తమని చంపేస్తానని బెదిరిస్తున్నాడని, తన కూతురు చదువుకు ఆటంకం కలిగిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తన ఆస్తులను తమకు ఇప్పించడంతోపాటు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

Advertisement

Next Story