వృద్ధాప్యం బయటపడకుండా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న నటి

by Nagaya |   ( Updated:2023-08-19 12:52:36.0  )
వృద్ధాప్యం బయటపడకుండా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న నటి
X

దిశ, సినిమా: అమెరికన్ యాక్ట్రెస్ అండ్ ప్రొడ్యూసర్ చార్లిజ్ థెరాన్ తాను ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్నట్లు వస్తున్న వార్తలపై మౌనం వీడింది. ప్రస్తుతం 48 ఏళ్లు వయసున్న ఆమె సహజమైన వృద్ధాప్యంలోని అందాన్ని కూడా ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ‘ఎల్లపుడూ యవ్వనంగా ఉండగలనని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. కాబట్టి నా శరీరాన్ని ఏ శస్త్రచికిత్స విధానాలకు గురిచేయలేదు. వయసుతోపాటు నా ముఖం మారుతోంది. వృద్ధాప్యం అంటే నాకు చాలా ఇష్టం. ముడతలు రాకుండా నా ముఖానికి ఏమో చేశానని ప్రజలు భావిస్తున్నారు. నా దృష్టిలో ప్లాస్టిక్ సర్జరీ చాలా చెడు అలవాటు. అందుకే ఈ పుకార్లను ఖండిస్తున్నా’ అని చెప్పింది.

అలాగే తాను వయసుకు తగ్గ సినిమాలే ఎంచుకుంటున్నానని, వివిధ వయసులలో తన శరీరం అనేక రకాల మార్పులకు లోనైనట్లు తెలిపింది. ‘27 ఏళ్లు వయసులో పోషించిన పాత్రలకు ఇపుడు న్యాయం చేయలేను. అప్పటిలాగే మూడు పూటల భోజనం తినలేను. కాబట్టి ఆటోమేటిక్‌గానే బరువు తగ్గుతున్నాను. మరికొన్నేళ్లలో అందరిలాగే చనిపోతానని కూడా తెలుసు’ అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story