చరణ్ సినిమా నిలిపివేత!

by samatah |   ( Updated:2023-08-16 06:34:17.0  )
చరణ్ సినిమా నిలిపివేత!
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ ట్రెండ్ మరింత ఊపందుకుంటుంది. ఇక ఇదివరకే చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమా రీ రిలీజ్ చేయగా మంచి వసూళ్లు రాబట్టింది. కాగా ఈసారి మెగాస్టార్ బర్త్ డే కానుకగా మెగా ఫ్యాన్స్‌కు చరణ్ మరో హిట్ సినిమా ‘నాయక్’ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. కానీ అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన గంటకే సినిమాను రీ రిలీజ్ చేయ‌డం లేద‌ని నిర్మాణ సంస్థ వెల్లడించింది. దీంతో రీ రిలీజ్ నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకోవ‌డానికి గ‌ల‌ కార‌ణాలేమిట‌న్నది స‌స్పెన్స్‌గా మారింది. వీవీవినాయ‌క్ ద‌ర్శక‌త్వంలో 2013లో రిలీజైన ఈ ‘నాయ‌క్’ మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. కానీ క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో ఆడియెన్స్ నుంచి చాలా నెగెటివ్ కామెంట్స్ వ‌చ్చాయి. బహుశా ఇది దృష్టిలోకి తీసుకుని ఈ మూవీని రీ రిలీజ్ చేయ‌కుండా అపినట్లు తెలుస్తోంది.

Read More: భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద స్వాతంత్ర్య దినోత్సవ చిత్రంగా ‘గదర్ 2’..

Advertisement

Next Story