సినీ ఇండస్ట్రీలో నయా ట్రెండ్.. వారు అలా చేస్తే విడాకులు తీసుకున్నట్లేనా..?

by Disha News Web Desk |
సినీ ఇండస్ట్రీలో నయా ట్రెండ్.. వారు అలా చేస్తే విడాకులు తీసుకున్నట్లేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని సినీ రంగాలలో రోజురోజుకు విడాకులుదిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని సినీ రంగాలలో రోజురోజుకు విడాకులుదిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని సినీ రంగాలలో రోజురోజుకు విడాకులుతీసుకునే సెలబ్రెటీలు ఎక్కువతున్నారు. గడిచిన కొద్ది కాలంలోనే చాలా సెలబ్రెటీ జోడీలు విడిపోయాయి. వారిలో ప్రముఖంగా నాగచైతన్య, సమంత.. ధనుష్, ఐశ్వర్య.. జంటలు ఉన్నాయి. తాజాగా చిరంజీవి కూతురు శ్రీజ, కళ్యాణ్‌దేవ్ జంట విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరంతా విడాకులు తీసుకుంటున్నట్లు ముందుగానే సోషల్ మీడియాలో చిన్న చిన్న హింట్స్ ఇస్తున్నారు. దానిలో భాగంగానే స్టార్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ముందుగానే వార్తలు వినిపించాయి. కానీ ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో తన పేరు ముందు ఉన్న 'అక్కినేని' అనే పదం తొలగించి ఆ వార్తలకు బలం చేకూర్చింది. 'అక్కినేని' అనేది తన భర్త ఇంటిపేరు. నిజంగానే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ కూడా విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు ముఖ్య కారణం శ్రీజ భర్త ఇంటిపేరును తన సోషల్ మీడియాలో ఎకౌంట్ల్‌లలో తొలగించడమే. ఇలా విడాకులు తీసుకునే సెలబ్రెటీ జోడీలు సోషల్ మీడియాలో పేర్లు తొలగించే ట్రెండ్ నడుస్తోంది. అంతే కాకుండా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా విషయంలోను ఇదే జరిగింది. తన భర్త పేరును సోషల్ మీడియా నుంచి తొలగించడంతో విడాకులు తీసుకుంటున్నట్లు జోరుగా వార్తలు ఊపందుకున్నాయి. దీనితో ప్రియాంక చోప్రా కలగజేసుకుని మరి తమ విడాకులు తీసుకోవడం లేదని వివరణ ఇచ్చింది. దీనితో సోషల్ మీడియాలో భర్తల పేర్లు తొలగిస్తే విడాకులు తీసుకుంటున్నట్లే అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.



Advertisement

Next Story