వంద కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్‌.. ఎక్కడెక్కడ ఎంత ఉండేదంటే?

by Hamsa |   ( Updated:2023-11-11 07:44:27.0  )
వంద కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్‌.. ఎక్కడెక్కడ ఎంత ఉండేదంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటుడు చంద్రమోహన్ తెలుగు, తమిళ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మొదటగా 1966లో రంగుల రాట్నం సినిమాతో తొలి చిత్రానికే నంది అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో కమెడియన్‌గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన 900 పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. కానీ గత కొద్ది కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇటీవల గుండెకు సంబంధించిన సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరగా నేడు నవంబర్ 11న ఉదయం 9.45 గంటలకు మరణించారు. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా చంద్రమోహన్ 100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నానని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘ హైదరబాద్‌లో కోంపల్లిలో గొల్లపూడి మారుతీరావు దగ్గర 35 ఎకరాల ద్రాక్షతోట కొన్నాను. కానీ తర్వాత దాన్ని చూసుకోవడం వీలుపడలేదు. అలాంటప్పుడు ఎందుకు దాన్ని అలాగే నా దగ్గర పెట్టుకోవడం ఒక్క ఎకరం కూడా ఉంచుకోకుండా అంతా అమ్మేశాను. ఉన్న భూమిని అమ్ముకోవద్దని శోభన్ బాబు చెప్తున్నా వినకుండా చెన్నైలో 15 ఎకరాలు అమ్మేశాను. ఇప్పుడు దాని విలువ రూ. 30 కోట్ల పైనే ఉంది. అటు శంషాబా‌ద్‌లో ప్రధాన రహదారి పక్కన ఆరెకరాలు కొన్నాను. కానీ చివరకు దాన్ని కూడా అమ్మేశాను. ఇలాగే దాదాపు రూ. 100 కోట్ల ఆస్తి వరకు పొగొట్టుకున్నాను. సంపాదించిన వాటికన్నా పోగొట్టుకున్నవే ఎక్కువ’’ అని చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Read More..

చంద్రమోహన్‌ను ఎప్పుడు చూసినా ఆ ఫీలింగ్ వచ్చేది: పవన్ కల్యాణ్

Advertisement

Next Story